భారత్-శ్రీలంక వన్డేల సమయంలో మార్పు

SMTV Desk 2017-11-20 11:50:00  bcci, india-srilanka, odi time, change, himachal pradesh

న్యూఢిల్లీ, నవంబర్ 20 : ఇండియా- శ్రీలంక మధ్య వచ్చే నెలలో జరిగే పేటీఎం వన్డే సిరీస్‌ సమయాలలో మార్పు చేస్తున్నమని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. చలి వాతావరణ పరిస్థితుల కారణంగా, ధర్మశాల, మొహాలీలో జరిగే వన్డేలు, మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఉదయం 11.30 గం.కు ప్రారంభమవుతాయని వివరించింది. విశాఖ వేదికగా జరిగే మూడో వన్డే, నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా జరుగుతుందని బోర్డు ఆధికారులు వ్యాఖ్యానించారు. బీసీసీఐ "హిమాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌పీసీఏ), పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(పీసీఏ)లతో సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయానికి వచ్చినట్లు, సవరించిన సమయం ప్రకారం డిసెంబర్‌ 10న ధర్మశాలలో తొలి వన్డే, డిసెంబర్‌ 13న మొహాలీలో రెండో వన్డే జరుగుతాయని" బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తెలిపారు.