నయావాల్ నయా రికార్డ్

SMTV Desk 2017-11-20 11:20:05  india, pujara record, srilanka, test, kolkatha

నయావాల్ ఆరుదైన రికార్డ్... కోల్‌కతా, నవంబర్ 20 : భారత్ క్రికెట్ నయావాల్, ఛెతేశ్వర్‌ పుజారా టెస్టుల్లో ఆరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఐదు రోజులు బ్యాటింగ్‌ చేసిన భారత మూడో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించడమే కాకుండా, హైదరాబాదీ సొగసరి క్రికెటర్‌ ఎంఎల్‌ జయసింహ, టీమిండియా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి వంటి దిగ్గజాల సరసన చేరాడు. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టులో వర్షం కారణంగా తొలి రోజు కేవలం 11.5 ఓవర్ల ఆటే సాధ్యమైంది. తొలి రోజు పుజారా 8 పరుగులు చేయగా, రెండవ రోజు 47 పరుగులతో, మూడవ రోజు ఆర్ద శతకంతో 52 పరుగులతో పెవిలియన్‌ చేరాడు. ఇక ఆ తర్వాత మొదలైన శ్రీలంక ఇన్నింగ్స్‌ నాలుగో రోజు మధ్యాహ్నం ముగిసింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ధావన్‌ (94) నిష్క్రమించడంతో పుజారా (2) బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇక ఐదో రోజు 22 పరుగులకు నిష్క్రమించాడు. ఇంతకముందు ఆస్ట్రేలియాతో 1960లో జరిగిన టెస్టులో జయసింహ, 1984లో రవిశాస్త్రి ఇంగ్లాండ్‌పై ఐదురోజులు ఆడారు. ఈ ముగ్గురూ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లోనే ఐదు రోజులు బ్యాటింగ్‌ చేయడం గమనార్హం.