అల్ రౌండర్ ఆదరగొట్టాడు

SMTV Desk 2017-11-19 18:33:25  jadeja, india, srilanka, test, spinner

కోల్‌కతా, నవంబర్ 19 : భారత్- శ్రీలంక ల మధ్య జరుగుతున్నతొలి టెస్టు ఈడెన్ పిచ్ సీమర్లకు అనుకులిస్తుండడంతో కెప్టెన్ కోహ్లి స్పిన్నర్ లను పక్కన పెట్టాడు. అయితే టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానంలో గల రవీంద్ర జడేజా బౌలింగ్‌ ఇవ్వకున్న, అదరగొట్టె ఫీల్డింగ్‌కు సిద్దమని నిరూపించాడు. కేవలం రెండు ఓవర్లు వేసిన జడేజా నాలుగో రోజు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో లంక ప్లేయర్‌ రంగనా హెరాత్‌ ఆడిన ఓ షాట్‌ బౌండరీ హద్దును సమీపిస్తుండగా, లాంగ్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా సూపర్‌ డైవ్‌తో అడ్డుకున్నాడు. అంతేగా​కుండా బంతిని అంతే వేగంతో వికెట్ల వైపు విసిరాడు. కానీ త్రుటిలో బంతి వికెట్లు ను మిస్‌ అయి రనౌట్‌ చేజారింది. ఈ ఫీల్డింగ్ కు కెప్టెన్ తో పాటు భారత్ ఆటగాళ్లు జడ్డుని అభినందించారు.