జమ్ముకశ్మీర్‌ పరిస్థితుల్లో మార్పు వస్తోంది : లెఫ్టినెంట్‌ జనరల్

SMTV Desk 2017-11-19 17:58:10  JAMMU KASHMIR, Srinagar, bandipora, Lt. Gen. CSD.

జమ్ముకశ్మీర్‌, నవంబర్ 19 : జమ్మూకశ్మీర్‌ పరిస్థితుల్లో మార్పు వస్తుందని లెఫ్టినెంట్‌ జనరల్‌ జెఎస్‌.సంధు వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మట్టుపెట్టిన ఉగ్రవాదుల గురించి తెలిపారు. "కశ్మీర్‌లో 190 మంది ఉగ్రవాదులను హతమార్చగా.. వారిలో 80 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. కశ్మీర్‌ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తోంది. ఉగ్రవాదులను హతమార్చడంలో భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ వర్గాలు సంయుక్తంగా కృషి చేయడం వల్లే ఇది సాధ్యపడింది" అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన టెర్రరిజంలో చేరిన స్థానిక యువకులు బయటికి వచ్చేయాల్సిందిగా సూచించారు. వారంతా భద్రతా దళాల ఎదుట లొంగిపోవాల్సిందిగా కోరారు. ఇప్పటికే ఉగ్రవాదాన్ని వీడి జనాల్లో కలిసిపోయిన వారిని ఉదాహరణగా చూపించారు. కాగా బందిపొరలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకరమైన కాల్పులు చోటు చేసుకున్న విషయం విదితమే.