వెయిట్‌ లిస్ట్‌ రైలు ప్రయాణికులకు తిపికబురు...

SMTV Desk 2017-11-19 17:55:08  Weight list train commuter, Railroad Webportal, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 19 : రైలులో ప్రయాణించే వారికి రైల్వే అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తున్నారు. ఈ తరుణంలోనే ‘వెయిట్‌ లిస్ట్‌’ రైలు ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం సెలవు రోజుల్లో ‘వెయిట్‌ లిస్ట్‌’లో ఉన్నవారికి టికెట్లు కన్‌ఫర్మ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. 2015 దీపావళి సెలవుల సీజన్‌లో వెయిట్‌ లిస్ట్‌లోని వారికి టికెట్‌ రద్దేయ్యే అవకాశాలు 25 శాతం అధికంగా ఉండగా 2016, 2017లో 18 శాతానికి తగ్గాయని రైల్‌యాత్రి వెబ్‌పోర్టల్‌ అధ్యయనంలో తేలింది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు టికెట్లు పక్కా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టే కదా! డెహ్రాడూన్‌- హౌరాడూన్‌ ఎక్స్‌ప్రెస్‌లో కన్ఫర్మేషన్‌ రేటు 20 శాతం, ముంబయి సీఎస్‌టీ- హౌరా సూపర్‌ ఫాస్ట్‌ మెయిల్‌లో 11 శాతం, పుణె-జమ్ముతావి జీలమ్‌ ఎక్స్‌ప్రెస్‌లో 12 శాతం, బెంగళూరు-ధనపుర్‌ సంఘమిత్ర సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో 5 శాతానికి పెరిగింది. గతేడాది నుంచి సగటు వెయిటింగ్‌ జాబితా సైతం తగ్గింది. కోటా- పట్నా ఎక్స్‌ప్రెస్‌లో 813 నుంచి 735కు, అహ్మదాబాద్‌- హరిద్వార్‌ యోగా ఎక్స్‌ప్రెస్‌లో 731 నుంచి 717కు, ముంబయి-దర్భంగా పవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో 800 నుంచి 769కి తగ్గింది. ఏటా దీపావళి సీజన్లో వెయిటింగ్‌ జాబితాలో ఉన్నవారికి టిక్కెట్ల కన్ఫర్మేషన్‌ రేటు తక్కువగా ఉండేదని రైలుయాత్రి తెలిపింది.