పాతబస్తీ రూపు రేఖలు మారిపోయాయి...

SMTV Desk 2017-11-19 17:08:29  patabasti hyderabad, DGP Anurag Sharma,

హైదరాబాద్, నవంబర్ 19 : పాతబస్తీ.. అంటే నిత్యం గొడవలతో మారు మోగిపోతుంది అని పేరు. కాని ఇప్పుడు పాతబస్తీ రూపురేఖలు మారిపోయాయనే చెప్పవచ్చు. అదెలా అంటారా..! గత రెండు దశాబ్దాలలో మొదటి సారిగా ఈ ఏడాది ఒక్క అల్లరి కూడా జరగలేదు. గతంలో రాళ్లు విసరడం, జనం గుంపులుగా జమ అయి నిరసనలు తెలపడం వంటివి ఎక్కువగా కనిపించేవి. అవన్ని క్రమేపీ తగ్గిపోయి ప్రజల మనస్తత్వంలో మార్పు వస్తుందని రిటైరైన డీజీపీగా అనురాగ్ శర్మ అన్నారు. ఈ కారణానికి పోలీసు వ్యవస్థ కూడా అక్కడి ప్రజలలో మార్పు తేవడానికి కృషి చేశారన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పాతబస్తీలో అల్లర్లు తగ్గి కాస్తంత ప్రశాంతత వాతావరణం నెలకొంది. అక్షరాస్యత రేటు పెరగడం కూడా ఇందుకు దోహదపడింది. ఇది ఒక శుభ పరిణామం అని ఒక సామాజికవేత్త తెలిపారు.