ధాటిగా ఆడిన భారత్ ఓపెనర్లు....

SMTV Desk 2017-11-19 16:53:37  india, srilanka, test series, kolkatha

కోల్‌కతా, నవంబర్ 19 : ఈడెన్ వేదిక గా భారత్- శ్రీలంక మధ్య జరుగుతున్నతొలి టెస్ట్, రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్(94), కే.ఎల్.రాహుల్(73), తమ బ్యాటింగ్ తో శుభారంభం చేశారు. శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో 294 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో పేలవ ఆట తీరుతో విఫలమైన ఓపెనర్లు ఈ సారి ధాటిగా బ్యాటింగ్ చేస్తూ లంక బౌలర్లను ఎదుర్కొన్నారు. ఒక దశలో ధావన్ శతకం సాధించేలా కన్పించిన, షనక బౌలింగ్ లో 94 వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. మరోపక్క రాహుల్ టెస్టుల్లో 10వ హాఫ్ సెంచరీ ను పూర్తి చేసుకున్నాడు. నాలుగవ రోజు వెలుతురు లేమి కారణంగా అంపైర్లు 30.3 వద్ద నిలిపేశారు. ఆట ముగిసే సమయనకి భారత్ స్కోర్ 171/1 కాగా, ప్రస్తుతం పుజారా(2), కే. ఎల్. రాహుల్ (73), క్రీజులో ఉన్నారు.