ప్రభాస్ పెళ్లి అనుష్కతో నేనా?

SMTV Desk 2017-05-28 17:18:25  prabas,anushuka,bahubali,bahubali-2,marrage,

హైదరాబాద్, మే 26 : ఈ వార్త గట్టిగా చదివితే వారి అభిమానులతో దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు... కాని చేప్పేది నిజం... ప్రభాస్ పెళ్ళి అనుష్క శెట్టితో కానే కాదని సుస్పష్టం అవుతున్నది. బాహుబలిలో అత్యంత ప్రతిభావంతంగా నటించిన ఆ ఇద్దరు పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించి ప్రఖ్యాతినార్జించారు. ఆ క్రమంలో అభిమానులు సైతం వారిద్దరు పెళ్ళి చేసుకోవాలని కోరుతూనే వస్తున్నారు. వారిద్దరు తప్పకుండా పెళ్ళి చేసుకుంటారని పలు సందర్భాల్లో తీసిన రియల్ ఫోటోల్లో తెలుస్తోంది. అయితే అసలు విషయానికోస్తే బాహుబలి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ప్రభాస్, తను పెళ్ళి చేసుకుంటానని ఇంట్లో ముందే హామి ఇచ్చిన నేపథ్యంలో పెళ్ళి సంబంధాలు వెతుకుతున్నారు. వారి స్వస్థలంలో ప్రసిద్ది చేందిన సిమెంట్ వ్యాపారి కూతురితో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది.