ఇదేనా ఆడే తీరు...!

SMTV Desk 2017-11-19 15:48:46  india, srilanka, test, kolkatha, 1st test

కోల్‌కతా, నవంబర్ 19 :శ్రీలంక తో జరుగుతున్న తొలి టెస్ట్ లో శ్రీలంక ఆటగాళ్లు ఐసీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. శనివారం ఫేక్ ఫీల్డింగ్ తో వార్తల్లోకి వచ్చిన ఘటన మరువకముందే, ఆదివారం మరో తప్పిదానికి పాల్పడ్డారు. శ్రీలంక ఇన్నింగ్స్ లో భాగంగా టీమిండియా బౌలర్ షమీ వేసిన 57వ ఓవర్‌ చివరి బంతికి పెరీరాను అంపైర్ ఎల్బీగా ప్రకటించాడు. అయితే పెరీరా పెవిలియన్ కు వెళ్లిపోతూ... మళ్లీ వెనక్కి తిరిగి రివ్యూ కోరాడు. పునఃసమీక్ష లో నాటౌట్ అని తేలింది. అయితే ఈ సమీక్షను స్వయంగా పెరీరానే కోరాడా లేదా బయట నుంచి అతనికి సంకేతాలు అందాయా అని అందరికీ సందేహాలు కలుగుతున్నాయి. పదే పదే ప్రదర్శించిన వీడియో రీప్లేలో శ్రీలంక శిబిరం నుంచి చేతులు వూపుతూ సంకేతాలు వచ్చినట్టు కనిపించింది. దీని పై నెటిజన్లు పెరీరా తీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ నియమావళి 3.2(సీ) ప్రకారం డీఆర్ఎస్ కు సంబంధించి ఎటువంటి సిగ్నల్స్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఇవ్వకూడదు. గతంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఇదే తరహా ఘటన తో ఐసీసీ నియమాలను ఉల్లంఘించాడు.