అచ్చం పాండ్యా లాంటి క్యాచ్...!

SMTV Desk 2017-11-19 14:59:10  

ఇస్లామాబాద్, నవంబర్ 19 : నేటి క్రికెట్ రంగంలో అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లకు ఉన్న ఆదరణ మరే ఏ ఆటకి లేదంటే అతిశయోక్తి కాదు...ఆటగాళ్లు కూడా తమ ప్రదర్శనతో కొన్ని కోట్ల మంది అభిమానులని సొంతం చేసుకున్నారు. ఇంకా మ్యాచ్ లో కళ్ళు చెదిరే షాట్లు, అద్భుతమైన క్యాచ్ ల తో చాలా మంది క్రీడాకారులు మ్యాచ్‌లను మలుపుతిప్పుతారు. తాజాగా పాకిస్థాన్‌లో దేశీయ టీ20 సిరీస్‌లో భాగంగా లాహోర్‌ బ్లూస్‌, పెషావర్‌ జట్ల మధ్య మ్యాచ్‌ లో అద్భుతమైన డైవ్‌తో ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టి అహ్మద్‌ షెహజాద్‌ అబ్బురపరిచాడు. అయితే ఈ క్యాచ్ కు నెటిజన్లు ముగ్దులై సామాజికమాధ్యమాల్లో తెగ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ క్యాచ్‌ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ప్రదర్శనను గుర్తుకుతెచ్చిందని చాలా మంది విశ్లేషిస్తున్నారు.