బాలిక కోసం 10 బృందాలు

SMTV Desk 2017-06-12 14:51:22  purnima, police, fathar,mothar

హైదరాబాద్, జూన్ 12 : పూర్ణిమ ఈ నెల 7న ఉదయం 7.45 గంటలకు పూర్ణిమ స్కూల్ లో ప్రాజెక్టు వర్క్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అమృత సాయి విలాస్ లోని ఫ్లాట్ నెం 213 లో నివాసం ఉంటున్న నాగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో పెద్ద కూతురు పూర్ణిమ భాష్యం స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నది. పూర్ణిమ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు స్కూల్ డ్రెస్, బ్యాగ్, వెయ్యి రూపాయలను తీసుకోని వెళ్ళింది. పోలీసులు బాలిక కోసం ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని దేవాలయాలు, బస్, రైల్వే స్టేషన్, ఇలా అన్ని ప్రాంతాల్లో పోలీసులు వెతుకుతున్నారు. నాలుగు రోజులు అయిన కూడా బాలిక ఆచూకి తెలియక పోవడంతో 10 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపారు. పోలీసులు సీసీ కెమెరా పుటేజిని గమనించిగా బాలిక వెళ్ళేటప్పుడు సంతోషంగానే వెళ్ళినట్లు తెలిసింది. పూర్ణమ కుటుంబ సభ్యులు, బందువులు, స్నేహితులు ఇలా అందరిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే బాలికకు చదువు ఇష్టం లేకపోవడంతో తల్లిదండ్రులు మందలించరాని అందుకే బయటకు వెళ్ళినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని వెల్లడించారు.