జియో ఫోన్‌లో వాట్సప్‌ ఎలా..?

SMTV Desk 2017-11-19 14:28:57  JIO, SMART PHONE, WHATS APP, BROWSER

ముంబై, నవంబర్ 19 : మొబైల్ టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన జియో ఫోన్ వినయోగాదారులు కాల్స్‌, డేటా ప్యాక్‌లతో ఆనందిస్తున్నా , యాప్ ల విషయంలో చాలా అసంతృప్తి గా ఉన్నారు. ఎందుకనగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ లాంటివి లేకపోవడమే..అయితే అలాంటి వినయోగాదారులు జియో ఫోన్ లో వాట్సప్‌ ఉపయోగించవచ్చు. వర్చ్యువల్‌ టెక్నాలజీ ద్వారా పలు వెబ్‌బ్రౌజర్లను విర్చ్యువల్‌గా ఉపయోగించుకోనే అవకాశం ఇంటర్నెట్‌లో ఉంది. తద్వారా మీ జియోఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేయెచ్చు. మీఫోన్‌లోని ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసిhttps://www.browserling.com అనే సైట్‌లో లాగాన్‌ అవ్వాలి. అక్కడ పలు ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌కు చెందిన పలు బ్రౌజర్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఎంచుకొని, గూగుల్‌ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లలో ఏదో ఒకదాన్ని ఎన్నుకొని అడ్రస్‌బార్‌లో http://web.whatsapp.com అని టైప్‌చేసి టెస్ట్‌నౌ అనే బటన్‌పై క్లిక్‌ చేస్తే, స్క్రీన్ మీద ఓ క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తుంది. మీదగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి వాట్సప్‌ వెబ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి కోడ్‌ను స్కాన్‌ చేస్తే మీజియోఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ అవుతుంది. ప్రస్తుతం జియోకు పోటి గా చాలా కంపెనీలు స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.