శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 294 ఆలౌట్...

SMTV Desk 2017-11-19 13:57:06  INDIA, SRILANKA, 1 ST TEST, TEST SERIES

కోల్‌కతా, నవంబర్ 19 : భారత్ తో మూడు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ నాలుగోవ రోజు ఆట ప్రారంభించిన లంక ఆటగాళ్లు 294 పరుగులు చేశారు. ప్రస్తుతం ప్రత్యర్ధి జట్టు 122 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్‌నైట్‌ స్కోరు 165/4తో నాలుగో రోజు, ఆదివారం ఆట ప్రారంభించిన లంక జట్టును, పేసర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, పదునైన బంతులకు పెవిలియన్‌ కు చేరారు. తర్వాత వచ్చిన రంగనా హెరాత్‌ (67), సురంగ్ లక్మల్ సహకారంతో చక్కటి ఇన్నింగ్స్ ను ఆడి జట్టు కు అండగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో అన్ని వికెట్లను టీమిండియా పేసర్లే పడగొట్టడం గమనార్హం.. ప్రస్తుతం బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు 36 పరుగులు చేసింది. ఓపెనర్లు ధావన్(15), కే ల్ రాహుల్(21) తో క్రీజులో ఉన్నారు.