తెలంగాణ రైతులకు విద్యుత్‌ సరఫరా ప్రయోగాత్మకంగా సఫలం...

SMTV Desk 2017-11-19 13:40:01  Power supply is experimentally successful, CM KCR, Genco, Transco MP Prabhakar Rao, Farmers current problems

హైదరాబాద్, నవంబర్ 19 ‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు వచ్చే ఏడాది నుంచి 24 గంటల విద్యుత్‌ పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నవంబర్‌ 6న అర్థరాత్రి నుంచి 24 గంటల విద్యుత్‌ను, ఐదారు రోజుల పాటు సరఫరా చేసి పరిస్థితి అంచనా వేయాలని మొదట విద్యుత్‌ శాఖ అధికారులు భావించారు. అయితే ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి 400కెవి సబ్‌స్టేషన్‌ వరకు పడే భారాన్ని, ఒత్తిడిని మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించి ప్రయోగాత్మకంగా సరఫరా చేయనున్నట్లు జెన్‌కో, ట్రాన్స్‌కో ఎంపీ ప్రభాకర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. దీనికి పై ఆయన సానుకూలంగా స్పందించారు.