పెరిగిన జాత్యహంకార దాడులు

SMTV Desk 2017-06-12 14:21:40  Religion Attack, Peterbaro,Manchester

లండన్, జూన్ 12 : మతాలను, జాతులను వేరు చేసే విధంగా ప్రపంచ దేశాలలో నిత్యం దాడులు జరుగుతూనే ఉండడం అందరిని భయాందోళనకు గురి చేస్తుంది. ఇటీవల మాంచెస్టర్, లండన్ లో ఐఎస్ ఉగ్రవాదులు తలపెట్టిన దాడుల్లో 30 మంది చనిపోవడంతో, ముస్లింలపై వివక్షపూరిత దాడులు అధికమవుతున్నాయి. పీటర్ బరో పట్టణంలోని ఫెన్ గేటు లో బుర్ఖా ధరించిన ఓ ముస్లిం మహిళ తన మూడేళ్ళ కూతురుతో కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను వెనుక నుంచి కిందకు తోసి, ఆమె ధరించని బుర్ఖాను చించేసి ఆమె పైనే విసిరాడు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. వారు దీనిని జాత్యంహంకార దాడిగా తెలిపారు. ఈ మధ్యకాలంలో ఒక ముస్లిం పాఠశాలకు బాంబు బెదిరింపులు రావడం, ప్రజలపై బాంబులు వేయడం ఎప్పుడు ఆపేస్తారని మరో ముస్లిం మహిళపై ఉమ్మేసిన ఘటన తెలిసిందే. ఆ సంఘటనలు మర్చిపోకముందే మళ్ళీ దాడికి ఒడిగట్టారు. ఇలా తరుచుగా జరిగే విధ్వంసాలకు అక్కడ ఉండే ప్రజలు భయబ్రాంతులకు గురై, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియక బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. మాంచెస్టర్ ఘటన ఫలితం ముస్లింలపై దాడులకు దారి తీసాయి.