210 వెబ్‌సైట్లలో ఆధార్‌ వివరాల తొలగింపు....

SMTV Desk 2017-11-19 13:19:23  Central and State Governments, Deleting Aadhaar Details websites, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 19 : దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 210 వెబ్‌సైట్లలో కొందరు లబ్ధిదారుల పేర్లు, వివరాలను ఆధార్‌ సంఖ్య సహితంగా, బహిరంగంగా ప్రదర్శించారని యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) వెల్లడించింది. దీంతో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతో, సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు స్పందించింది. కాగా ఈ ఉల్లంఘన జరిగిన సమాచారాన్ని ఎప్పుడు తొలగించారో మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ప్రవేశపెట్టిన పథకాల ప్రజయోనాలు పొందాలంటే లబ్ధిదారులకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉండనివ్వకుండా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ కొనసాగుతుండగా, తమ వద్ద ఉన్న వ్యక్తిగత సమాచారం సమగ్రంగా, భద్రంగా ఉంటుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. లేనిచో కఠినమైన నిబంధనలు ఉన్నాయని తెలిపింది.