బిజెపి ముస్లింలను బెదిరిస్తోంది: ఫరూక్ అబ్దుల్లా

SMTV Desk 2017-11-19 12:35:04  farook abdulla about bip, farook abdulla

భారతీయ జనతా పార్టీపై జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా విరుచుకుపడుతున్నారు. ప్రత్యక్షంగా బిజెపి పేరు ఎత్తకుండా ముస్లిం వ్యతిరేక ధోరణి ముప్పు తెస్తుందని హెచ్చరించారు. మత ప్రాతిపదికన భారత్ ను చీల్చే ఆలోచనలను వారు ఎప్పుడు ముగింపు పలుకుతారు అని ప్రశ్నించారు. ఓటు వేయకపోతే అంతు చూస్తామని బిజెపి నేతలు ముస్లింలను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ దేశం అందరిది. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్‌ ఎవరైనా తమకు ఇష్టమైన వారికి స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు.