ఆయనేమీ సచ్చరిత్రుడు కాదు : అల్లాణి శ్రీధర్

SMTV Desk 2017-11-19 12:26:26  director allani sridhar, ram gopal varma, boyapati srinu,

హైదరాబాద్, నవంబర్ 19: నంది అవార్డుల వివాదంపై రోజుకొకరు విమర్శిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై దర్శకుడు అల్లాణి శ్రీధర్ స్పందించారు. అవార్డులు ఇచ్చే కమిటీకి, ప్రభుత్వానికి సంబంధం ఉండదని ఆయన అన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు నంది అవార్డులను ఇవ్వగా, ఎన్నడూ రాని విమర్శలు ఇప్పుడు వస్తున్నాయని, కొంతమంది వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ, చులకన అవుతున్నారని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలు వద్దని చెబుతూ, ఉదాహరణకు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, జేమ్స్ కామెరూన్ అవార్డును తెచ్చి బోయపాటి శ్రీను కాళ్ల వద్ద పెట్టాలని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. బోయపాటి శ్రీను దగ్గర లేనిదేంటి? రాంగోపాల్ వర్మ దగ్గర ఉన్నదేంటి? అని ప్రశ్నిస్తూ, ఆయనేమీ సచ్చరిత్రుడు కాదని ఎద్దేవా చేశారు. కళాత్మక సినిమాలకు ఇవ్వాల్సిన సినిమాలు కమర్షియల్ సినిమాలకు మారాయన్నది మాత్రం నిజమని అన్నారు. జ్యూరీ సభ్యుల ఎంపిక కూడా పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.