కలకలం సృష్టిస్తున్న ఐటీ మెరుపు దాడులు

SMTV Desk 2017-11-19 11:36:48  IT department searching, Jayalalithaa Poes Garden property, shashikala

చెన్నై, నవంబర్ 19 : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన పోయెస్‌గార్డెన్‌లో అనిశా అధికారులు నిర్వహించిన మెరుపు సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని, శశికళ మేనకోడలు షకీలాను విచారణ నిమిత్తం ఐటీ అధికారులు తీసుకెళ్లారు. కాగా ఈ సోదాలకు వ్యతిరేకంగా పలువురు నిరసనలను దిగి.. ఆందోళనలు, ఆత్మాహుతి దాడులతో బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ పరిణామాలతో పోయెస్‌గార్డెన్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం ఈ దాడులను అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నాడీఎంకే వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. కాగా జయలలిత మేనకోడలు దీప.. తనను సంప్రదించకుండా ఐటీ దాడులు చేపట్టడం శోచనీయమని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానంటూ పేర్కొనారు.