ఈ నెల 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం...

SMTV Desk 2017-11-19 11:35:00  Schedule CWC, Congress vice president Rahul Gandhi, Working Committee meeting monday, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 19 : గుజరాత్ ఎన్నికలు డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపడతారని వార్తలు వినిపిస్తున్న వేళా ఆ దిశగా కార్యాచరణ సిద్దమవుతుంది. అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఆమోదించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం ఉదయం 10:30 గంటలకు సమావేశం కానుంది. ఈ సదస్సులో షెడ్యూల్ కు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిన వెంటనే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనికి అంగీకారం తెలుపనుంది. గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరిగేలోపే, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఈ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ఒక్కరు మాత్రమే పోటీలో ఉండవచ్చని తెలుస్తుంది. వయోభారం, అనారోగ్యం నేపథ్యంలో అధినేత్రి సోనియాగాంధీ పార్టీ సారథ్య బాధ్యతలను తనయుడు రాహుల్ గాంధీకి అప్పగించాలని భావిస్తున్నారు.