విరాట్ సేనకు ప్రత్యేక క్యాంపు ...

SMTV Desk 2017-11-19 11:26:29  india team, bcci, special camp, safari tour

ముంబై, నవంబర్ 19 : ప్రస్తుతం శ్రీలంక తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న కోహ్లి సేన తర్వాత పాల్గొనే వన్డే, టీ20 సిరీస్‌లు వచ్చే నెల డిసెంబరు 24తో ముగుస్తాయి. అనంతరం భారత్ జట్టు దక్షణాఫ్రికా పర్యటనకు బయలదేరనుంది. ఈ విషయంపై బోర్డు యాక్టింగ్‌ సెక్రటరీ అమితాబ్‌ చౌదరి మాట్లాడుతూ "సఫారి పర్యటనకు వెళ్లే ముందు టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ ప్రత్యేక క్యాంపు నిర్వహించనున్నట్లు" తెలిపారు. సఫారీ టూర్ వచ్చే సంవత్సరం జనవరి 5 తో ప్రారంభం కానుంది. సమయం తక్కువే ఉందని తెలుసు. కానీ, ఆటగాళ్లకు సాయపడే విధంగానే ఈ క్యాంపును నిర్వహిస్తున్నామని, అంతే కాకుండా ఐసీసీ తొమ్మిది జట్లతో టెస్ట్ సిరీస్ ప్రకటించిన నేపధ్యంలో, భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్ ల కోసం, డిసెంబర్ 1 న జరిగే ఎస్‌జీఎమ్‌ సమావేశంలో చర్చించనున్నట్లు చౌదరి వ్యాఖ్యానించారు.