వామపక్షాలు చలో అసెంబ్లీ!

SMTV Desk 2017-11-19 11:10:38  left chalo assembly, ap updates, cpm, cpi

అమరావతి, నవంబర్ 19: విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం వామపక్షాలు, ప్రజాసంఘాలు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నాయి. వివిధ పార్టీలతోపాటు ఉద్యోగ, కార్మిక సంఘాలూ ఇందులో పాల్గొననున్నాయి. రాష్ట్రం విడిపోయి మూడేళ్లు దాటుతున్న కేంద్రం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని ఆయా సంఘాలు పేర్కొంటున్నాయి. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు దీనిపై నోరెత్తడం లేదని, కనీసం అడిగేందుకూ ధైర్యం చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు నోరెత్తడం లేదని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన నిధులు ఇవ్వాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో వివరించారు.