స్మార్ట్ ఫోన్ కాదు...అంతకు మించి...

SMTV Desk 2017-11-19 10:51:58  moto z, smart phone, polaroid instant, photo print

ముంబై, నవంబర్ 19 : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెర్షన్ లతో యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంత వరకు మనం ఫోన్ లో ఫోటోలు తీసుకోని, ప్రింట్ కావాలంటే ప్రింటర్ కు కనెక్ట్ చేయాలి. కానీ మోటో జెడ్‌ ఫోన్‌ లో ఫొటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నవాళ్లు కెమెరా మోడ్‌, పాటలు వినాలంటే స్పీకర్‌ మోడ్‌ తో తమకు నచ్చిన ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఈ మొబైల్‌ కోసం ప్రింటర్‌ను సిద్ధం చేశారు. మొబైల్‌ వెనుక భాగంలో ప్రింటర్‌ను జోడించి ఎంచక్కా కావల్సిన ప్రింట్లు తీసుకోవచ్చు. పోలరాయిడ్‌ ఇన్‌స్టా షేర్‌ ప్రింటర్‌గా పిలిచే దీన్ని థర్డ్‌ పార్టీ ఆప్‌ సాయంతో మొబైల్‌కు అనుసంధానం చేయాలి. అనంతరం ఫోన్ లోగల ఫొటోలతోపాటు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, గూగుల్‌ పొటోస్‌ ఆప్‌లోని ఫొటోలను 2×3 అంగుళాల ఫొటో ప్రింట్లు తీసుకోవచ్చు. మార్కెట్ లో దీని ధర రూ.13వేలు కాగా, దీంతో 20 ఫొటోలు ప్రింట్‌ తీసుకోనే సౌకర్యం కలదు.