ఆధిక్యంలో లంకేయులు...

SMTV Desk 2017-11-19 10:32:41  india, srilanka, test series, 4 th day, kolkatha

కోల్‌కతా, నవంబర్ 19 : భారత్- శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు, 172 పరుగులకే టీమిండియాను బోల్తా కొట్టించిన శ్రీలంక జట్టు తిరిమన్నె ( 51), ఏంజెలో మాథ్యూస్‌ (52) అర్ధ సెంచరీలతో మంచి స్థితిలో నిలిచింది. తక్కువ పరుగులకే ఆలౌటైనా కోహ్లీ సేన బౌలింగ్ ను మాత్రం ఘనంగానే ఆరంభించింది. ఆదిలోనే విజృంభించిన భువనేశ్వర్‌ కుమార్‌, వరుస ఓవర్లలో ఓపెనర్లు కరుణరత్నె, సమరవిక్రమలను పెవిలియన్ కు పంపాడు. ఒక దశలో లంక పటిష్టంగా కనిపిస్తున్నప్పటకి ఉమేష్ యాదవ్ ధాటికి, ఆర్ధ సెంచరీ వీరులు తిరిమానె, మాథ్యూస్‌ వికెట్లు తీయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ప్రస్తుతం నాలుగో రోజు ఆట ఇరు జట్లుకు కీలకం కానుంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన లంక ప్రస్తుతం 7 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.