సమిష్టి కృషి ఫలితం లెజెండ్‌కు 9 అవార్డులు : బాలకృష్ణ‌

SMTV Desk 2017-11-18 18:35:35  balakrishna about nandi awards, balakrishna, nandi awards

విజయవాడ, నవంబర్ 18 : సమిష్టి కృషితోనే లెజెండ్‌ సినిమాకు 9 అవార్డులు వచ్చాయని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. నంది అవార్డులు వచ్చిన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. మాటలతో కాదు చేతలతో చూపించిన సినిమా లెజెండ్‌ అని చెప్పారు. నంది అవార్డులపై ఎన్ని కాంట్రవర్శీలు వచ్చాయో అందరికీ తెలుసని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ నంది అవార్డు స్క్రీనింగ్‌ కమిటీకి, దర్శకుడు బోయపాటి శ్రీనుకు కృతజ్ఞతలు తెలిపారు.