రాజ‌కీయాల కోసం క‌ళాకారులను బ‌లిచేయొద్దు : గుణ‌శేఖ‌ర్‌

SMTV Desk 2017-11-18 18:27:01  gunashekhar about nandi awards, gunashekhar, nandi awards

హైదరాబాద్, నవంబర్ 18: నంది అవార్డులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చిచ్చురేపాయి. తాజాగా ఈ వివాదంపై దర్శకుడు గుణ‌శేఖ‌ర్ స్పందించారు. నంది అవార్డుల ఎంపిక‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించింది, కానీ ఏపి ప్రభుత్వం మాత్రం అవార్డులపై స్పందించలేదని ఆరోపించారు. రుద్రమదేవి సినిమా రిలీజ్‌కు ముందే వినోద‌పుప‌న్ను మినహాయింపునకు అప్లై చేశా, మూడు నెల‌ల తర్వాత‌ ఫైల్ క్లోజ్ చేశామని అధికారులు చెప్పారని గుణ‌శేఖ‌ర్ వివరించారు. మంత్రి గంటా కూడా ప‌న్నుమిన‌హాయింపుపై నాకు హామీఇచ్చారు. కానీ నా ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లం అయ్యాయ‌ని గుణ‌శేఖ‌ర్ ఆవేద‌న‌ను వ్యక్తం చేశాడు. అందుకే సీఎం చంద్ర‌బాబుకు బ‌హిరంగ లేఖ రాశానని తెలిపారు. విమర్శిస్తే మూడేళ్ల‌వ‌ర‌కూ అవార్డులు ఇవ్వారా? అని ద‌ర్శ‌కుడు ప్ర‌శ్నించాడు. రాజ‌కీయాల కోసం క‌ళాకారుల జీవితాలు బ‌లిచేయొద్దు అని గుణ‌శేఖ‌ర్ త‌న ఆవేద‌న‌ను మీడియా ద్వారా తెలిపారు.