ముక్కోణపు సిరీస్ ఆడనున్న కోహ్లీసేన...

SMTV Desk 2017-11-18 16:49:25  india, srilanka, bangladesh, traingle t-20 series

న్యూఢిల్లీ, నవంబర్ 18 : భారత్ క్రికెట్ జట్టు వచ్చే ఏడాది శ్రీలంకలో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడనుంది. భారత్- శ్రీలంక- బంగ్లాదేశ్ ల మధ్య ఈ సిరీస్ జరగనుంది. శ్రీలంక వేదికగా మార్చి 8న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌ 20 తో ముగుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 తో శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా తమ దేశంలో ముక్కోణపు సిరీస్ జరపాలని శ్రీలంక క్రికెట్ బోర్డు, అటు బీసీసీఐ, ఇటు బంగ్లాదేశ్‌ బోర్డులతో సంప్రదింపులు జరిపింది. ఇందుకు బోర్డు ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ విషయం పై లంక బోర్డు అధికారులు మాట్లాడుతూ.. టోర్నీలో భాగంగా ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచులు ఆడుతుందని, 20 న జరిగే ఫైనల్ తో టీ-20 సిరీస్ ముగుస్తుందని, త్వరలో పూర్తిస్థాయి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని వ్యాఖ్యానించారు