ఫేస్‌బుక్‌ లో సెల్‌/బై ఆప్షన్‌...!

SMTV Desk 2017-11-18 16:12:00  face book, market place, social media, sell by buy option

ముంబై, నవంబర్ 18 : ఫేస్‌బుక్‌... ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తుంది. వినయోగాదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రత్యేకతలను అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ సంస్థ తాజాగా సెల్‌/బై ఆప్షన్‌ను యూజర్లు కు అందించనుందని సమాచారం. ఇప్పటికే ఓఎల్‌ఎక్సా, క్వికర్‌ సంస్థలు వస్తువులు ను ఆన్ లైన్ వేదికగా అమ్మడం, కొనడం వంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇదే తరహాలో మార్కెట ప్లేస్‌ పేరుతో ఫేస్‌బుక్‌ రాబోతోంది. ఫేస్‌బుక్‌ పేజీలో మార్కెట్‌ ప్లేస్‌ అని ఓ ట్యాబ్‌ వస్తుంది. అందులోకి వెళ్లి అమ్మాలనుకుంటున్న లేదా కొనాలనుకుంటున్న వస్తువుల ఫొటోలు పెట్టి వివరాలు రాయాలి. అది చూసి నచ్చినవారు అక్కడే ఛాటింగ్‌ లేదా కాల్‌ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, థాయిలాండ్‌ సహా 25 దేశాల్లో ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. త్వరలోనే అందరూ ఈ ఆప్షన్ ను వినియోగించుకోవచ్చని ఆధికారులు తెలిపారు.