బుమ్రా సిక్స్ ప్యాక్...బూమ్...బూమ్

SMTV Desk 2017-11-18 15:10:13  bumrah, six pack image, social media, twitter

హైదారాబాద్, నవంబర్ 18 : భారత్ క్రికెట్ లో పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా, తన పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేస్తూ, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా ఖ్యాతి పొందాడు. అయితే బుమ్రా తను ఫిట్ నెస్ ను పెంచుకోవడానికి జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా తన సిక్స్‌ ప్యాక్‌ చిత్రాన్ని బుమ్రా ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రంతో పాటు " మనకు మనం నిరంతరం మెరుగవ్వాలంటే అంకిత భావం, కష్టపడడం అవసరం “ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఇది చూసిన నెటిజన్లు తెగ లైకులు, కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా యువతులు ‘బుమ్రా మీ ఫిజిక్‌ను అందంగా మార్చుకున్నారు’ అని పొగిడేస్తున్నారు. భారత్ క్రికెట్ సారధి కోహ్లీ ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, తన జట్టు ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తున్నారు. అతని వల్లే కేఎల్‌ రాహుల్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఫిట్‌నెస్‌ మెరుగు పరుచుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో బుమ్రా చేరాడు.