అనుమానంతో విమానాన్ని దింపేశారు

SMTV Desk 2017-06-12 11:47:10  London,Aeroplane,Terrarizm,Islamic State

బెర్లిన్, జూన్ 12 : విమానంలో ప్రయాణించే వ్యక్తులపై అనుమానంతో విమానాన్ని దించేశారు. లండన్ కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు ఉగ్రవాదంపై చర్చలు జరపడంతో అనుమానాస్పదంగా గమనించిన సిబ్బంది ఆ విషయాన్ని ఫైలట్ కు వివరించి విమానాన్ని కొలోగ్నికి దారి మళ్లించారు. 151 మందితో స్లోవేనియా నుంచి జర్మనీకి వెళ్ళే ఈ విమానంలో ముగ్గురు అనుమానితులు ఉగ్రవాదానికి సంబంధించిన విషయాలపై సంభాషణలు చేస్తున్నారు. అనుమానం రావడంతో విమానాన్ని కొలొగ్ని విమానాశ్రయానికి మళ్లించి, విమానంలోని ప్రయాణికులను భద్రంగా కిందకి దింపేశారు. తర్వాత ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బ్రిటన్ లో ఉగ్రవాదుల చేసిన పేలుళ్లకు తీవ్రమైన ప్రాణ నష్టం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేసిన చర్యతో జర్మనీతో పాటు ఇతర దేశాలు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.