బెంగాల్‌ ప్రభుత్వంపై ముకుల్‌రాయ్ పిటిషన్‌

SMTV Desk 2017-11-18 13:00:57  mukulroy case on west banga govt, west banga, mukulroy

కోల్‌కత్తా, నవంబర్ 18: ఇటీవల కాలంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ను విడిచి బిజెపిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ నేత ముకుల్‌రాయ్, బెంగాల్‌ ప్రభుత్వం తన ఫోన్‌ కాల్స్‌ను ట్యాప్‌ చేస్తుందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నిజాన్ని తేల్చాలని కోరుతూ వొడాఫోన్‌, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ముకుల్‌రాయ్‌ చేసిన కాల్స్‌, వచ్చిన కాల్స్‌, అతని బంధువుల కాల్స్‌ వివరాలను ట్యాప్‌ చేసిన ఆధారాలు సమర్పించాలని కోరింది. దీనిపై తదుపరి విచారణకు నవంబరు 20కి వాయిదా వేస్తూ తీర్పు నిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ ,ఆరోపణలు నిజమైతే బెంగాల్‌ ప్రభుత్వంపై సంబంధిత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.