ఫేక్ వార్తలకు చెల్లుచీటీ...

SMTV Desk 2017-11-18 11:17:00  fake news, face book, google, social media

వాషింగ్టన్, నవంబర్ 18 : నేటి సమాజంలో సోషల్ మీడియా వేదికగా పలు నకిలీ వార్తలు తెగ హల్... చల్... చేస్తున్నాయి.. అయితే ఇక వీటికి పూర్తిగా స్వస్తి పలకాలని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌, సామాజిక మాధ్యమ౦ పేస్ బుక్ శ్రీకారం చుట్టాయి. ఆన్‌లైన్‌లో వ్యాపించే బూటకపు వార్తలను నిలువరించే దిశగా గూగుల్‌,ఫేస్‌బుక్‌ 75 ప్రముఖ వార్తాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని సమాచారం. ఇందులో మైక్రోసాఫ్ట్‌, ట్విటర్‌ కూడా భాగస్వాములయ్యేందుకు అంగీకరించాయి. త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని అధికార వర్గ ప్రతినిధులు తెలిపారు.