తల్లి సుఖానికి పిల్లలు బలి

SMTV Desk 2017-06-12 11:22:26  mothar, daughtar, lover

టెక్సాస్, జూన్ 12 : తల్లి ప్రేమకు ఎవ్వరు వెల కట్టలేరు. ఈ ప్రపంచలో ఎక్కడైనా తల్లి పిల్లల మీద చూపించే ప్రేమకు అవదులుండవు. తల్లి ప్రేమకు మచ్చ తెచ్చేవిధంగా తన సుఖాల కోసం పిల్లలను బలి తీసుకుంది ఓ తల్లి. వివరాల్లోకి వెళితే... అమండా హాకిన్స్ (19) అనే మహిళ టెక్సాస్ లో నివసిస్తుంది. హాకిన్స్ కు కొన్ని సంవత్సరాల క్రితమే పెళ్ళై, రెండేళ్ళ వయస్సున్న ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. హాకిన్స్ 16 యేళ్ళ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన ప్రియుడి ఇంటికి కారులో వెళ్ళినప్పుడు తన ఇద్దరి పిల్లలను కూడా తీసుకెళ్ళింది. ప్రియుడి ఇంటి ముందు కారు నిలిపి పిల్లలను కారులో వదిలి వెళ్ళింది. ప్రియుడితో రాసలీలలు జరుపడానికి వెళ్లి 15 గంటల అయిన రాలేదు. కారులో ఉన్న పిల్లలు ఏడుస్తూ అందులో ఊపిరాడక సృహ కోల్పోయారు. మద్యం మత్తులో సుఖాలు అనుభవించిన తల్లి 15 గంటల తరువాత తూలుతూ వచ్చి చూసే సరికి ఆ పిల్లలిద్దరు మరణించారు. తన ప్రియుడి తో కలిసి పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. తన పిల్లలు పువ్వుల వాసనకు సృహ తప్పారని ఎలాగైనా బ్రతికించమని హాకిన్స్ వైద్యులను కోరింది. వైద్యులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసుల విచారణలో అసలు సంఘటన వెలుగు చూసింది.