నయా బాద్‍షా... పృథ్వీ షా...

SMTV Desk 2017-11-18 10:58:55  prithvi shah , mumbai, cricket player, under-19

ముంబై, నవంబర్ 18 : భారత్ జట్టులోకి ఇంకో సచిన్, కోహ్లీ వస్తున్నాడని క్రికెట్ మేధావులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇంతటి ప్రశంసలు అందుకున్న అతడెవరో కాదు.. ముంబై కి చెందిన 18 ఏళ్ల పృథ్వీ షా... ఆరు మ్యాచ్‌లు.. 759 పరుగులు.. 63.25 సగటు.. 4 శతకాలు.. ఇవీ ఫస్ట్‌క్లాస్‌ కెరీర్లో పృథ్వీ షా గణాంకాలు. అంతే కాకుండా కివీస్ తో జరిగిన వార్మప్ మ్యాచ్లో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ లైన, బౌల్ట్, సౌది, కూడా ఈ యువ కిరణం ఆటకు ఫిదా అయిపోయారు. భారత్ అండర్‌-19 జట్టు కోచ్‌ రాహుల్‌ పృథ్వీ షాలో ప్రతిభను గుర్తించి, అండర్‌-19 జట్టుకు అవసరం లేదని చెప్పి, దులీప్‌ ట్రోఫీలో ఆడేలా సిఫార్సు చేశారు. ద్రవిడ్‌ లాంటి వ్యక్తి పృథ్వీని సీనియర్‌ స్థాయిలో ఆడించాలని, అతడిని భవిష్యత్తు కోసం తీర్చి దిద్దుకోవాలని బీసీసీఐకి చెప్పాడంటే అతడి ప్రతిభేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. క్రికెట్లో పృథ్వీ సంచలనాలు 14 ఏళ్ల వయసులోనే పృథ్వీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతను 2013లో 546 పరుగులు చేసి పాఠశాల క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డును తర్వాత ప్రణవ్‌ ధనవాడె (1009) బద్దలు కొట్టాడు. అయితే ఇలాంటి రికార్డుల తో ఎంతో మంది కుర్రాళ్ళు తెరమరుగు లేకుండా పోయారు. కానీ పృథ్వీ షా మాత్రం తన ఆటను మరింత మెరుగుపరుచుకొని, లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాడు.