తలలనే మార్చేసిన వైద్యుడు..

SMTV Desk 2017-11-18 10:54:19  Italy doctor, Neuro Surgeon Sergia Canoeiro, Austria

ఆస్ట్రియా, నవంబర్ 18: వైద్య రంగంలో కాలేయ మార్పిడి చూశాం, గుండె మార్పిడి చూశాం, కానీ తల మార్పిడి చూశారా.! అసలు అది సాధ్యమా ? సాధ్యమే అంటున్నాడు ఓ వైద్యుడు. అనడమే కాదు చేసి నిరూపించాడు. ఇటలీకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ సెర్గియా కానోవేరో, సుమారు 18 గంట పాటు చైనాలోని హెర్బిన్ మెడికల్ యూనివర్సిటీ నిపుణుల బృందంతో ఆస్ట్రియాలోని వియన్నాలో ఒక శవం తలను మరో శవానికి అమర్చినట్టు ప్రకటించారు. ఇది విజయవంతం అయిందని ప్రకటించిన ఆయన అందుకు సాక్ష్యాలను మాత్రం చూపించలేదు. ఈ శస్త్రచికిత్స టెక్నిక్ ఏమిటన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. అంతే కాదు త్వరలో జీవించి ఉన్న మనుషుల తలలను మార్చే సమయం ఆసన్నమైందని అన్నారు.