ఎదురీదుతున్నభారత్...

SMTV Desk 2017-11-18 10:21:59  india- srilanka test, kolkatha, 3 rd day, pujara

కోల్‌కతా, నవంబర్ 18 : భారత్- శ్రీలంక మధ్య తొలి టెస్టు కు వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు. రెండో రోజు జరిగిన ఆటలో భారత్ జట్టు 32.5 ఓవర్లు ఎదుర్కొన్న టీమ్‌ ఇండియా 74/5తో కష్టాల్లో ఉంది. పుజారా ఒక్కడే ఒంటరి పోరాటం చేసి జట్టు ని ఆదుకునే బాధ్యత తీసుకున్నాడు. లంక బౌలర్ లో శనక పేస్ పిచ్ ని సద్వినియోగం చేసుకొని, రహానె (4), అశ్విన్‌ (4), వికెట్లను దక్కించుకున్నాడు. వర్షం కురుస్తుండడంతో అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మూడో రోజు ఆట ప్రారంభంలో భారత్ కి షాక్ తగిలింది. వ్యక్తిగత పరుగులు 47తో క్రీజులోకి వచ్చిన పుజారా మొదట సింగిల్‌ తీశాడు. ఆ తర్వాత హెరాత్‌ వేసిన 33.5వ బంతిని ఫైన్‌ లెగ్‌లో బౌండరీ బాది అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. ఐతే గమగె వేసిన 37.2వ బంతికి అనూహ్యంగా క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ వృద్ధి మాన్‌ సాహా(25), జడేజా(14), క్రీజులో ఉన్నారు.