పాకిస్తాన్ కు చైనా ఝలక్

SMTV Desk 2017-06-11 19:42:18  China,Pakistan,India,Shanghai Cooperation Organization

బీజింగ్, జూన్ 11: చైనా పాకిస్తాన్ కు ఝలక్ ఇచ్చింది. ఆస్తానాలో జరిగిన షాంగై సహకార సంస్థ(ఎస్ సీ ఒ) సదస్సులో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తొ సమావేశం కావలసిన చైనా అధ్యక్షుడు జిన్ పిన్ హాజరు కాలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బలూచిస్తాన్ లో ఇద్దరు చైనా ఉపాధ్యాయులు హత్యకు గురయ్యారనే కారణంతో సమావేశానికి రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల జిన్ పింగ్ తొ మాట్లాడకుండానే షరీఫ్ స్వదేశం చేరుకున్నారు. భారత ప్రధాని మోడీ, కజకిస్తాన్ ప్రధాని నూర్ సుల్తాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తొ జిన్ పింగ్ జరిపిన చర్చల గురించి చైనా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత నెలలో క్వెట్టాలో అపహరణకు గురైన ఉపాధ్యాయుల్ని చంపివేయడంతో చైనాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.