ముగాబే ముందుకొచ్చారు...

SMTV Desk 2017-11-17 17:46:53  robert mugabe, zimbabve, prisident, house , arrestArmy

హరారే, నవంబర్ 17 : జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబేను సైన్యం ఆయన ఇంట్లోనే నిర్బంధించడంతో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అయితే గృహ నిర్భందంలో ఉన్న అధ్యక్షుడు తొలి సారి బయటకు వచ్చి, ఒక ఆధికార కార్యక్రమంలో పాల్గొన్నారు. హరారేలోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముగాబే నీలం రంగు గౌన్‌, టోపీ ధరించి, విచ్చేశారు. గతంలో రొడేసియా అనే పేరున్న జింబాబ్వే 1965లో బ్రిటిష్‌ పాలన నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకుంది. బ్రిటన్‌ నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి జింబాబ్వే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తన రాజకీయ వారసురాలిగా తన భార్యను తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. దీంతో తన వైఖరికి వ్యతిరేకంగా సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది.