ఈ రోజు ఒక చారిత్రాత్మకమైంది: బిల్‌గేట్స్

SMTV Desk 2017-11-17 17:29:33  bill gates, ap cm, chandrababu naidu, visakhapatnam

విశాఖపట్టణం, నవంబర్ 17: ఈ రోజు ఒక చారిత్రాత్మకమైంది అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అన్నారు. విశాఖపట్టణంలో నిర్వహించిన అగ్రిగేట్ సమ్మిట్ ముగి౦పు సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రైతులపై ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని తెలిపారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో టెక్నాలజీని వినియోగించుకుని ఏపీ ముందుకు వచ్చిందని తెలిపారు. భార‌త్‌లాంటి దేశంలో చిన్న‌, సన్నకారు రైతులే అధికంగా ఉన్నారని అన్నారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా చేసినప్పుడు వృద్ధి సాధ్యం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.