ముగిసిన భారత్ ప్రస్థానం...

SMTV Desk 2017-11-17 17:18:38  china open series, fuzhou, p. v sindhu lose, saina nehwal

చైనా, నవంబర్ 17 : చైనాలో ఫుజౌ వేదికగా జరుగుతున్నచైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటికే గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సైనా, ప్రణయ్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా పీవీ సింధు ఓటమితో భారత్ పోరుకు తెర పడింది. ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ సింధు 11-21, 10-21తో గావొ ఫాంగ్‌జీ(చైనా) చేతిలో ఓడిపోయింది. ఆట ఆద్యంతం సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ గా నిలువలేకపోయింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఫాంగ్‌జీ ర్యాంకు 89 కాగా, 2వ స్థానంలో గల సింధు ఓడిపోవడం గమనార్హం.