పరిపాలన సౌలభ్యం కోసమే అలా చేశాం : కేసీఆర్‌

SMTV Desk 2017-11-17 16:59:30  cm kcr, ts chief minister, district issue, assembly,

హైదరాబాద్, నవంబర్ 17 : తెలంగాణాలో జరుగుతున్న శాసనసభ సమావేశంలో జిల్లాల విభజన పై కాంగ్రెస్ నాయకుల ప్రశ్నలకు సీఎం కేసీఆర్ స్పందించారు. హైదరాబాద్‌కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా జిల్లాలుగా విభజన చేయలేదని, పరిపాలనా సౌలభ్యం కోసమే తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 2లక్షల కుటుంబాలు 14 జిల్లాల్లో, 3లక్షల కుటుంబాలు 10 జిల్లాల్లో, 4లక్షల కుటుంబాలు 4 జిల్లాల్లో ఉన్నాయన్నారు. కొత్త జిల్లాల వల్ల 50శాతం భూ రికార్డులను ప్రక్షాళన చేశామన్నారు. సరైన సమాచారం లేకుండా కాంగ్రెస్‌ సభ్యులు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2016 అక్టోబర్ 11 న 21 కొత్త జిల్లాలుగా విభజించి 31 జిల్లాలుగా చేసిన విషయం తెలిసిందే.