కెపిహెచ్బి లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు...

SMTV Desk 2017-11-17 16:02:07  hyderabad, kphb colony, police ride, prosticution,

హైదరాబాద్, నవంబర్ 17: మహానగరంలో ఎక్కడిక్కడ గుట్టుచప్పుడు కాకుండా కొందరు వ్యభిచార వ్యాపారం నడుపుతున్నారు. ఓ సాధారణ గృహాన్ని వ్యభిచార గృహంగా మార్చేశారు. చుట్టూ పక్కల ఎవరికీ అనుమానం కలుగకుండా ఈ వ్యాపారాన్ని నడిపారు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని కెపిహెచ్బి కాలనీలో ఓ వ్యభిచార గృహం పోలీసుల కంట పడింది. కాలనీలోని 6వ ఫేజులో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ యువతితో పాటు పలువురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. లక్షా 32 వేల నగదు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.