బ్రిటన్ మహిళా జాబితాలో మలాలా....

SMTV Desk 2017-11-17 15:52:03  Malala yousafzai, britan powerful women list , Oxford university, Pakistani activist,

న్యూఢిల్లీ, నవంబర్ 17 : మలాలా యూసఫ్‌ జాయ్‌... ఉగ్రవాదుల కోరల నుండి ప్రాణాలతో బయట పడ్డ ఈ పాకిస్తానీ యువ తేజం బాలల హక్కుల కోసం పోరాటం చేస్తుంది. ఆమె కృషికి గుర్తింపు గాను 2014 లో శాంతి విభాగంలో నోబెల్ బహుమతి దక్కింది. తాజాగా మలాలా యూసఫ్‌ జాయ్‌ బ్రిటన్‌లోని అత్యంత ప్రభావవంతమైన మహిళా నాయకురాలి జాబితాలో చోటు దక్కించుకొంది. ఈ జాబితాను యూకేకు చెందిన హార్పర్‌ బజార్‌ మ్యాగజైన్‌ రూపొందించింది. ఈ మ్యాగజైన్‌ 150వ వార్షికోత్సవం సందర్భంగా పలువురు మహిళా ప్రతిభావంతుల జాబితాను తయారుచేసింది. ‘ఒపీనియన్‌ ఫార్మర్స్‌’ విభాగంలో లెబనాన్‌కు చెందిన బారిస్టర్‌ అమల్‌ క్లోనీ, హాలీవుడ్‌ నటి ఎమ్మా వాట్సన్‌, హ్యారీపోటర్‌ రచయిత్రి జేకే రోలింగ్‌ సరసన మలాలా పేరు కూడా ఉంది. ప్రస్తుతం మలాలా లండన్ లో గల ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో విద్యను కొనసాగిస్తుంది.