సెల్ ఫోన్ లో ఆ గొంతు ఎవరిదీ...?

SMTV Desk 2017-11-17 15:08:18  Meghana Erande, bolly wood dubbing actress, cell phone voice, mumbai

ముంబై, నవంబర్ 17 : మనం వేరొకరికి ఫోన్ చేసేటప్పుడు బిజీ లో ఉంటే ఒక వాయిస్ మన ఫోన్ లో ధ్వనిస్తుంది. అదే " ద "సబ్‌స్క్రైబర్ యు హావ్ కాల్డ్ కరెంట్లీ అన్-అవేలబుల్.. ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్" అంటూ వాయిస్ వినిపిస్తుంది. అయితే చాలా సార్లు ఈ వాయిస్ ఎవరిదీ అని అనుకుంటాంగా.. ఇంతకి ఆ వాయిస్ ఎవరిదో తెలుసా..? ఆమె ముంబైకి చెందిన ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ మేఘనా సుధీర్ ఎరాండే. 1989 నుంచి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించిన మేఘనా యాక్షన్, డ్రామా "బేవాచ్: హవాయి" అనే ఇంగ్లీష్ సినిమాలో హీరోయిన్ పమేలా ఆండర్సన్ కి హిందీ వాయిస్ ఓవర్ ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో వచ్చే పలు సూచనలు కూడా ఆమె వాయిస్ ద్వార వచ్చినవే. ఈమెకు ఇంగ్లిష్, హిందీ, మరాఠీ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యత ఉండడంతో ఈ రంగంలో స్థిరపడింది.