సెల్ ఫోన్ మీ చెంత...ఆరోగ్య చింత...

SMTV Desk 2017-11-17 14:43:09  smart phone addiction, university of texas, washington, scientists

వాషింగ్టన్, నవంబర్ 17 : స్మార్ట్ ఫోన్ మానవ జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత యాంత్రిక పనులులో ఎన్నో మార్పులు వచ్చాయి. స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరు ఉండలేకపోతున్నారు. అయితే వీటి వాడకంలో లాభాలు మాట అలా ఉంచితే, ప్రమాదాలూ పొంచి ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు కనుగొన్నారు. ఇందులో భాగంగా 800 మంది మొబైల్‌ఫోన్‌ వినయోగాదారులను ఎంపిక చేశారు. వలంటీర్ల పనితీరును, మొబైల్‌ అందుబాటులో ఉన్నపుడు (దానిని ఉపయోగించకపోయినా సరే) పనిలో, ఏకాగ్రతలో కలిగే మార్పులను పరిశీలించగా తాము ఈ విషయాన్ని గమనించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.