30ఏళ్లుగా నన్ను భరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు :జగపతి బాబు

SMTV Desk 2017-11-17 13:28:59  jagapathi babu, ap nandi awards, legend movie awards,

హైదరాబాద్, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత మూడు రోజుల క్రితం నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ‘లెజెండ్’ చిత్రంలో ఉత్తమ ప్రతి నాయకుడిగా నటించిన జగపతిబాబు కు నంది వరించింది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ‘‘నంది అవార్డుకు నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు. 30ఏళ్లుగా నన్ను భరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు. ‘లెజెండ్‌’ చిత్రంలో నా పాత్రకు అవార్డు రావడం నాకో పెద్ద విషయం. నేను హీరోగా చేసిన నా తొలి చిత్రం ‘సింహ స్వప్నం’ మూడు రోజులు ఆడింది. నేను విలన్‌గా చేసిన ‘లెజెండ్‌’ మూడేళ్లు ఆడింది. ఈ విలన్ పాత్ర ప్రభుత్వం, ప్రేక్షకుల నుంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అన్ని సంవత్సరాల్లో అవార్డులు వచ్చిన ‘లెజెండ్‌’, ‘శ్రీమంతుడు’, ‘నాన్నకు ప్రేమతో..’ ‘హితుడు’ సినిమాల్లో నటించడం చాల సంతోషంగా ఉందన్నారు. ‘లెజెండ్‌’లో నటనకుగానూ బాలకృష్ణకు కూడా అవార్డు రావడం చాలా సంతోషం. ఆయన ఈ అవార్డుకు అర్హులు. ఈ విషయం గురించి ఇటీవలే అనిల్‌ గారితో మాట్లాడా. సినిమా దాదాపు మూడేళ్లకు పైగా ఆడింది. ఇలాంటిది చరిత్రలో రావడం చాలా కష్టం’’ అని చెప్పుకొచ్చారు జిత్తు భాయ్.