మూడీస్‌ సర్వేలో భారత్ కు ‘బీఏఏ2’...

SMTV Desk 2017-11-17 13:16:38  moodys survey, india baa2 rank. modhi, prime minister

న్యూఢిల్లీ, నవంబర్ 17 : భారత్ లో నరేంద్ర మోదీ ఇప్పటికే పలు ఆర్ధిక, ద్రవ్య సంస్కరణలు చేపడుతున్న విషయం తెలిసిందే. వీటి వల్ల ఇండియా అభివృద్ధి పధం వైపు వడివడిగా అడుగులేస్తుంది. తాజాగా అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ‘మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌’. భారత క్రెడిట్‌ రేటింగ్‌ను అత్యల్ప పెట్టుబడి స్థాయి ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు సవరించింది. ఈ క్రెడిట్ రేటింగ్ లు దేశ ద్రవ్య, ఆర్థిక, నియంత్రణ విధానాలకు కొలమానంగా నిలుస్తాయి. అయితే ఇంకా చాలా ముఖ్యమైన సంస్కరణలు తొలి దశలోనే ఉన్నాయని, ప్రస్తుత విధానాలతో ఇండియాలో వ్యాపార సరళి, ఉత్పాదకత, విదేశీ(ఎఫ్ డి ఐ), దేశీయ పెట్టుబడులు పెరుగుతాయని, విశ్వాసం వ్యక్తం చేసింది. అటల్‌ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా 13 ఏళ్ల క్రితం మూడీస్‌ భారత్‌కు బీఏఏ3 రేటింగ్‌ ఇచ్చింది. మరల మోదీ హయంలో ఇటువంటి ఘనత భారత్ సాధించింది.