భారత్ తడబాటు...

SMTV Desk 2017-11-17 10:15:04  india- srilanka test, kolkatha, first test, kohli

కోల్‌కతా, నవంబర్ 17 : శ్రీలంక తో కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు కు ఉహించని షాక్ తగిలింది. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై కోహ్లీసేన లంక బౌలర్ సురంగ లక్మల్(6-6-0-3) ధాటికి వణికిపోయింది. వర్షం కారణంగా జరిగిన ఆట తక్కువే కానీ భారత్‌కు వాటిల్లిన నష్టం ఎక్కువ. ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలిరోజు ఆట సాధ్యమైన 11.5 ఓవర్లలో భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది. రాహుల్‌ (0), ధావన్‌ (8), కోహ్లి (0) విఫలం కాగా...చతేశ్వర్‌ పుజారా(43 బంతుల్లో 8 బ్యాటింగ్‌; 2 ఫోర్లు), అజింక్యా రహానే (0 బ్యాటింగ్‌) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.