కోస్తాను ముంచెత్తనున్న భారీ వర్షాలు...

SMTV Desk 2017-11-16 17:23:30  Visakhapatnam, coastal andhra, farmers

విశాఖపట్టణం, నవంబర్ 16: కోస్తా౦ద్రలో వరుణుడు కన్నెర్రజేస్తున్నాడు. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం కారణంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. అంతేకాదు ఉత్తరకోస్తా తీరం వెంబడి తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్య కారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, ఒడిశా, ఉత్తరకొస్తా మధ్యలో తీరందాటే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర రైతులు మాట్లాడుతూ... సంవత్సరమంతా కష్ట పడి పండించిన పంటలు కోతకొచ్చే సమయంలో ఈ వానలు ఏంటి..? అంటూ ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల్లో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో వర్షాలు పడితే పంటలు ఎం కావాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.