పానసోనిక్‌ నుండి స్మార్ట్ ఫోన్...

SMTV Desk 2017-11-16 16:51:48  panasonic, smart phone p-91, smart phone, 1 gb ram

ముంబై, నవంబర్ 16 : సాంకేతిక రంగంలో స్మార్ట్ ఫోన్ పెను విప్లవం సృష్టించింది. వినయోగాదారుల అభిరుచికి అనుగుణంగా సంస్థలు కూడా కొత్త తరహా ఫోన్ లను యూజర్లు కు అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ పానసోనిక్‌ పి-సిరీస్‌లో మరోస్మార్ట్‌ ఫోన్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. అతి తక్కువ ధరకే ఈ ఫోన్ ను అందించడం విశేషం. పి91 పేరుతో తీసుకొచ్చిన దీని ధర రూ.6,490. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత రిటైల్‌ స్టోర్లలోనూ ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈఫోన్ లో 1జీబీ ర్యామ్‌, 8 మెగాపిక్సెల్‌ వెనుక కెమేరా, 5 మెగా పికెల్స్‌ ముందు కెమేరా , 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం , 1.1 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ , 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయం , ఆండ్రాయిడ్‌ 7.0, ఫీచర్స్ కలిగి ఉంది.